エピソード

  • పదేళ్లుగా పరిష్కారం కాని ప్రభా అరుణ్ కుమార్ హత్య కేసు... ప్రభుత్వం ప్రకటించిన మిలియన్ డాలర్ల రివార్డు..
    2024/11/04
    పదేళ్లు గడిచినా, 41 ఏళ్ల ప్రభా అరుణ్ కుమార్ హత్య కేసు ఇప్పటికీ పరిష్కారం కాలేదు. 2015 మార్చి 7న సిడ్నీలోని పరమాట్టా పార్క్‌లో దారుణంగా హత్య చేయబడిన ప్రభా, ఆమె భర్తతో ఫోన్‌లో మాట్లాడుతుండగా ఈ సంఘటన చోటుచేసుకుంది.కేసు ఇంకా మిస్టరీగానే ఉండటంతో, న్యూ సౌత్ వేల్స్ ప్రభుత్వం మరియు పోలీసులు ఈ కేసులో సమాచారం అందించేవారికి $1 మిలియన్ రివార్డు ప్రకటించారు.
    続きを読む 一部表示
    3 分
  • తెలంగాణలో రెండో దశ మెట్రో రైలుకు అనుమతులు..
    2024/11/04
    నమస్కారం, ఈ రోజు నవంబర్ 4వ తారీఖు సోమవారం. ఈ వారం జాతీయ వార్తలు.
    続きを読む 一部表示
    5 分
  • గెలిచేది ఎవరు? అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో భారతీయ ఓటర్ల హవా..
    2024/11/01
    యావత్తు ప్రపంచం నవంబర్ 5 ఎన్నికల అనంతరం ఎవరు అమెరికా అధ్యక్ష పదవిని చేపడతారా అని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మునుపెన్నడు లేని విధంగా రిపబ్లిక్ పార్టీ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్, డెమోక్రటిక్ పార్టీ అభ్యర్ధి కమలా హారిస్ ల మధ్య పోరు, నువ్వా, నేనా అన్న రీతిలో ఉత్కంఠభరితంగా సాగుతోంది.
    続きを読む 一部表示
    14 分
  • దీపావళి పండగకు బొమ్మల కొలువులు.. నోములు.. భజనలు..
    2024/10/31
    దీపాల కాంతిలో ప్రతి ఇంటా దీపావళి పండుగ ఆనందంగా జరుపుకోవాలంటూ, మీకు మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు! ఈ శీర్షికలో, 12 ఏళ్ల క్రితం స్థిరపడ్డ సవిత చిన్ననెల్లి గారి కుటుంబం దీపావళి పండగను జరుపుకునే విధానం .. వారి ప్రత్యేక శైలిని తెలుసుకుందాం. అలాగే, సవిత గారి చిన్ననాటి మధుర స్మృతులు మరియు తెలంగాణ సంప్రదాయ వంటకాల విశేషాలను కూడా ఈ పోడ్కాస్ట్‌లో తెలుసుకుందాం!
    続きを読む 一部表示
    6 分
  • మెల్బోర్న్ ప్రాథమిక పాఠశాల వద్ద కారు ప్రమాదం.. 11 ఏళ్ల బాలుడు మృతి..
    2024/10/30
    నమస్కారం, ఈ రోజు అక్టోబర్ 30వ తారీఖు సోమవారం. SBS తెలుగు వార్తలు.
    続きを読む 一部表示
    4 分
  • "నరక చతుర్దశి నాడు తెల్లవారు నాలుగు గంటలకు హారతులు ఇస్తాము - ఇది మా దీపావళి సాంప్రదాయం.." - ఉమా గంగిశెట్టి
    2024/10/29
    దీపావళి భిన్నమైన పద్ధతుల్లో జరుపుకుంటారు.తమ కుటుంబ సంప్రదాయాలకు అనుగుణంగా చేసుకుంటారు. మెదక్‌లో పుట్టి, హైదరాబాద్‌లో పెరిగిన ఉమా గారు తమ కుటుంబ సాంప్రదాయాలను తప్పకుండా పాటిస్తారని చెప్పారు. దీపావళి నాడు తెల్లవారుజామున లేచి పండుగ కార్యక్రమాలను మొదలు పెడతారని తెలియజేసారు.
    続きを読む 一部表示
    6 分
  • సరదా సరదాగా జరుపుకునే ఉమ్మడి దీపావళి పండగ..
    2024/10/28
    ఉమ్మడి కుటుంబాలలో జరుపుకునే పండుగలు అబ్బురపరిచే విధంగా ఉంటాయి. అందరూ కలిసి వండుకోవడం, పిల్లలు అందరూ కలిసి ఆడుకోవడం, పెద్దనాన్నలు, బాబాయిలతో కలసి పండగ జరుపుకోవడం ముచ్చటైన విషయం ! అలాంటి ఉమ్మడి కుటుంబ నేపథ్యంనుండి వచ్చిన కార్తీక గారు, ఇప్పుడు సిడ్నీలో దీపావళి పండగను అక్కడి సబర్బ్ లో ఉండేవారితో కుటుంబం లా ఎలా సరదాగా జరుపుకుంటున్నారో ఈ శీర్షిక ద్వారా తెలుసుకుందాం.
    続きを読む 一部表示
    7 分
  • "దీపావళి పండుగకు మా నానమ్మ చేసే తరాల నాటి ప్రత్యేక వంటకం ఇది.." - మహాలక్ష్మి మల్లంపాటి
    2024/10/27
    చిన్నతనంలో దీపావళి అంటే బాణాసంచా, పిండి వంటలు, స్నేహితులతో ఆడిన ఆటలు గుర్తొస్తుంటాయి.
    続きを読む 一部表示
    7 分