-
サマリー
あらすじ・解説
ఏ భాషకైనా తలమాణికాలు సామెతలు, జాతీయాలు. భాషకు సొబగులు అద్ది, భావ ప్రకటనకు దోహదపడేవే సామెతలు. సరళ సుందరమైన భాష, భావావేశం, లయ సామెతలకు పెట్టని అలంకారాలు. అక్షరజ్ఞానం ఉన్నవాడైన, లేనివాడైనా మాటల్లో చమత్కారాన్ని ఎప్పుడో ఒకప్పుడు ఒలకబోస్తాడు. ఆ చమత్కారంలో ఆనందం, ఉపదేశం రెండూ ఇమిడి ఉంటాయి. ‘వాక్యం రసాత్మకమ్ కావ్య’ మయితే రసాత్మకమైన వాక్యమే సామెత.